మొక్కను బాబూ నన్ను తొక్కకు బాబూ
పిడికెడు నీళ్ళు విసిరితె చాలు మ్రానౌతాను- నీకు మేలౌతాను!
భూమి తల్లి గుండెలపై అల్లారుముద్దౌతా
సూర్యరశ్మి వేడిలోన శిరసెత్తి వికసిస్తా
చెడుగాలిని శుద్ధిచేసి నవ గాలులనే అందిస్తా
మొక్కను బాబూ ...!
పెరటిలోన చెట్టౌతా- చేనులోన మ్రానౌతా
పశుపక్షుల గూడౌతా- బాటసారి నీడౌతా
నీ నవ్వుల పువ్వౌతా నీ ఆశల పండౌతా
మొక్కను బాబూ …!
కారడవిలొ నీ కంటికి కనువిందు చేస్తాను
కలపైనా కర్రైనా నీ రక్షణ కోరేను
కడదాకా నీవెంట చితిమంటల పాలౌతా
మొక్కను బాబూ- నన్ను తొక్కకు బాబూ
నేను చెట్టౌతాను- నన్ను కొట్టకు బాబూ!