1.ఇంద్రజాలం! హోటల్లో.. సర్వర్: సార్ సార్ ... కొంపమునిగింది! యజమాని: ఏమైంది? ఏమైంది!? సర్వర్: పీకల్దాకా తిన్నాడు సార్ ఆ మెజిషియన్! అయితే బిల్ ఇవ్వగానే , 'అబ్రకదబ్రా' అని త్రేన్చాడు సార్! మరుక్షణం బిల్‌తో పాటు మాయమయ్యాడు!" 2. నేనే పెద్ద! టీచర్ : శీనా! ఎలిఫెంట్ పెద్దదా.. చీమ పెద్దదా? శీన: మీరు ముందు వాటి డేట్ ఆఫ్ బర్తులు చెప్పండి సార్. ఆ తర్వాత గానీ ఏది పెద్దదో చెప్పలేను మాస్టారు! 3. ట్యూబులైటు! టీచర్ : ఎగ్జామ్ హాల్లో కనిపించే మూడు పేపర్లు ఏవేవో చెప్పండి? విద్యార్థి: క్వశ్చన్ పేపర్ , ఆన్సర్ షీట్, అడిషినల్ పేపర్...ఇంకా..ఇంకా.. టీచర్: ఇంకానా?! మూడే కదా, నేను చెప్పింది?! విద్యార్థి: కనిపించని నాలుగో పేపర్ ఉంటుంది టీచర్, అదే..నేను కాపీ కొట్టేందుకు రాసుకెళ్ళే ..చిట్టీ! 4. తెల్ల కాగితం! వెంగళప్ప: 5 తెల్ల పేపర్లు ఇవ్వండి. షాపు యజమాని : 5 పేపర్లు లేవు , ఒక్కటే ఉంది. వెంగళప్ప: పర్వాలేదు- ఆ ఒక్కటే ఇవ్వండి, దాన్నే జిరాక్స్ తీయించుకుంటాను. 5. కుక్క-పిల్లి రాము: గోపి! మీ ఇంట్లో పిల్లి, కుక్క స్నేహంగా ఉంటాయా? గోపీ: ఇంట్లో మా చెల్లి-నేనే స్నేహంగా ఉండం. ఇంక అవేం ఉంటాయి? 6. త్రాసు ఉచితం! కస్టమర్ (కోపంగా అడిగాడు): పావుకిలో హల్వా పార్శిల్ చేయమంటే, ఐదువందల రూపాయలకు బిల్లు వేశావేమిటి? షాప్ యజమాని: "త్రాసులోంచి హల్వా రాలేదు సార్. అందుకని త్రాసును కూడా కలిపి పార్శిల్ చేసేశాం 7. ఏంకాలం?! సంధ్య:కాలాలు ఎన్నో చెప్పవా? సీత: ఎండా కాలం, వానాకాలం, శీతాకాలం,..ఇంకా పోయేకాలం! 8."కాయలు గాని కాయలు ఏమిటి?" "కోడి గాని కోడి ఏమిటి? "కాయ గాని కాయ ఏమిటి?" "టపాకాయలు!" "పకోడి! "తలకాయ!" 9.టీచర్:సాగే గుణం వేటికి ఉంటుందిరా? స్టూడెంట్: టీవీ సీరియల్స్ కు ! 10.పుల్లయ్య: డాక్టర్ గారూ, మా అల్లుడికి పిచ్చి పట్టిందండీ! డాక్టర్: అలాగా, ఎక్కడున్నాడు అతను?! పుల్లయ్య: ఇదిగో,నా జేబులో!! 11. చెవులు నొప్పి! మూడేళ్ళ సృజన అంటోంది దీపావళి రోజు రాత్రి- సృజన: అబ్బ! చేతులెంత నొప్పి పుడుతున్నాయో! అమ్మమ్మ: ఎందుకమ్మా!అన్ని టపాకాయలు కాల్చావనా? సృజన: ఉహుఁ..అంతసేపు చెవులు మూసుకున్నాను కదా, అందుకని!