1. ఒక పచ్చ రంగు తలుపు తెరిస్తే , ఒక గోధుమరంగు తలుపు ఉంటుంది. అదికూడా తెరిస్తే , ఒక తెలుపు రంగు తలుపు ఉంటుంది. అదికూడా తెరిస్తే , ఒక ఈత కొలను ఉంటుంది!! ఏమిటది ? ఏమిటది?

  2. తిరగేస్తే పెద్దదైపోయేది ఏ అంకె?

  3. ఒకటో అంతస్తులో 32 తెల్ల మనుషులు ఉన్నారు. రెండో అంతస్తులో రెండు మురికి గదులు ఉన్నాయి. మూడవ అంతస్తులో రెండు తెల్ల గదుల్లో రెండు నల్ల మంచాలు ఉన్నాయి. నాలుగవ అంతస్తులో ఇద్దరు నల్ల రాజులు ఉన్నారు. అయిదో అంతస్తులో ఒక నల్ల అడవి ఉంది!! ఏంటి, ఇదంతా?

  4. తలపైన పూసే పువ్వు, ఎండ నుండి వాన నుండి కాపాడేపువ్వు , గుండ్రని పువ్వు, వాడిపోని పువ్వు, అది ఏంటి?

  5. ఒక చెట్టుకు 12కొమ్మలు, ఒక్కొక్క కొమ్మకు 30ఆకులు.ఏమిటది?

  6. పసుపు దుప్పట్లో తెల్లటి ఆసామి, అతనెవరు?

  7. ఇళ్ళు లేని నగరాలు, నీళ్ళులేని సముద్రాలు.ఏమిటది?

  8. పచ్చని పాము తోకతో రాయిని మోస్తుంది.ఏమిటది?

  9. కడుపు నిండగానే లేచి నిలబడతాడు.అతడు ఏవరు?

  10. నిప్పుల్లో పుడుతుంది. ఆకాశంలోకి వెలుతుంది.ఏమిటది?

  11. రాక రాక అతడు వస్తే తెరవని వాడు తెరుస్తాడు, ఏమిటది?

  12. రూపంలేని వాడు, రంగులేనివాడు, పై నుండి కిందపడతాడు.కానీ దెబ్బలు తగలవు, తనకుతాను వెళుతుంటాడు. అతను ఎవరు?

  13. నల్లని రాజ్యానికి చల్లని రాజు, చుట్టూ చక్కని భామలు ,అది ఎవరు?





జవాబులు:
1.కొబ్బరికాయ
2.6!
3.ముఖం- పళ్ళు, ముక్కు రంధ్రాలు, కంటిగుడ్లు, కను బొమ్మలు, జుట్టు.
4.గొడుగు
5: సంవత్సరం, నెలలు, రోజులు.
6: వడ్లగింజలు
7: అట్లాస్
8: పొట్లకాయ
9: గోనెసంచి.
10: పొగ
11: ఆవలింత
12: నీరు
13: ఆకాశం, చంద్రుడు, చుక్కలు