ఆత్మ శుద్ధిలేని ఆచారమది ఏల?
భాండ శుద్ధిలేని పాకమేల?
చిత్త శుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!
కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు
నష్టపెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా
లలిత సుగుణజాల తెలుగుబాల!
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు; జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
బద్ధకము సంజనిద్దుర
వద్దు సుమీ దద్దిరంబు వచ్చుందానన్
వద్దందురు ఇంటివారు
మొద్దందురు తోటివారు ముద్దు కుమారీ!