1.పేరెంట్ అయోమయంలో పడేదెప్పుడు!? జవాబు: "మీ వాణ్ణి 'ఐ.ఐ.టి L.k.Gలో' చేరుస్తారా 'ఆర్డినరీ L.k.Gలో' చేరుస్తారా?” అని హెడ్ మాస్టారన్నప్పుడు. 2.ఆశ్చర్యం కలిగించే విషయం!? జవాబు: గూడ్స్ డ్రయివర్ ఫాస్ట్ ఫుడ్ తినటం!! ౩. సైన్సుమాస్టారు భార్యని ఎలా పొగుడుతాడు!? జవాబు: "ఇంటికి సోలార్ దీపం ఇల్లాలు" 4.గడియారాలు రిపేర్ చేసేషాపు ముందు బోర్డు!? జవాబు: మీటైం బాగోపోతే మమ్మల్ని సంప్రతించండి!! 5.ఫారెస్ట్ ఆఫీసర్ అయోమయంలో పడేదెప్పుడు!? జవాబు: కొత్త అల్లుడు 'పిట్టమాంసం' కోరినప్పుడు! 6.జలుబు చేసిన పిల్లాణ్ణి డాక్టరు దగ్గరకు తీసుకెళ్లిన తల్లి, అయోమయంలో పడేదెప్పుడు!? జవాబు: "బాబుని ఐస్‌క్రీం, కూల్‌డ్రింక్ యాడ్‌లు చూడనివ్వకండి" అని డాక్టరు అన్నప్పుడు!! 7."మేడ్ ఫర్ ఈచ్ అదర్ " అంటే.....!? పెళ్ళికూతురు డాక్టరు, పెళ్ళికొడుకు మందులషాపు ఓనరు!!