1.ఇంద్రజాలం!   
హోటల్లో..    
సర్వర్: సార్  సార్ ... కొంపమునిగింది!   
యజమాని: ఏమైంది? ఏమైంది!?   
సర్వర్: పీకల్దాకా  తిన్నాడు సార్ ఆ మెజిషియన్! అయితే  బిల్   ఇవ్వగానే , 'అబ్రకదబ్రా' అని  త్రేన్చాడు సార్! మరుక్షణం   బిల్‌తో   పాటు మాయమయ్యాడు!"

2. నేనే పెద్ద!     
టీచర్ : శీనా!  ఎలిఫెంట్  పెద్దదా..  చీమ  పెద్దదా?    
శీన: మీరు  ముందు వాటి  డేట్ ఆఫ్  బర్తులు చెప్పండి  సార్. ఆ తర్వాత గానీ  ఏది  పెద్దదో   చెప్పలేను    మాస్టారు!

3. ట్యూబులైటు!   
టీచర్ :  ఎగ్జామ్  హాల్లో  కనిపించే  మూడు  పేపర్లు  ఏవేవో చెప్పండి?   
విద్యార్థి: క్వశ్చన్  పేపర్ , ఆన్సర్ షీట్, అడిషినల్  పేపర్...ఇంకా..ఇంకా..   
టీచర్: ఇంకానా?! మూడే కదా, నేను చెప్పింది?!   
విద్యార్థి: కనిపించని  నాలుగో  పేపర్ ఉంటుంది  టీచర్,  అదే..నేను కాపీ కొట్టేందుకు రాసుకెళ్ళే ..చిట్టీ!

4. తెల్ల కాగితం!   
వెంగళప్ప: 5 తెల్ల  పేపర్లు   ఇవ్వండి.   
షాపు యజమాని : 5 పేపర్లు లేవు , ఒక్కటే  ఉంది.   
వెంగళప్ప: పర్వాలేదు- ఆ ఒక్కటే  ఇవ్వండి, దాన్నే  జిరాక్స్  తీయించుకుంటాను.

5. కుక్క-పిల్లి      
రాము: గోపి! మీ  ఇంట్లో  పిల్లి, కుక్క  స్నేహంగా  ఉంటాయా?   
గోపీ: ఇంట్లో‌  మా   చెల్లి-నేనే  స్నేహంగా  ఉండం. ఇంక  అవేం  ఉంటాయి?

6. త్రాసు ఉచితం!   
కస్టమర్ (కోపంగా అడిగాడు): పావుకిలో  హల్వా పార్శిల్ చేయమంటే, ఐదువందల రూపాయలకు బిల్లు వేశావేమిటి?   
షాప్ యజమాని: "త్రాసులోంచి  హల్వా  రాలేదు సార్. అందుకని  త్రాసును కూడా కలిపి పార్శిల్  చేసేశాం

7. ఏంకాలం?!   
సంధ్య:కాలాలు ఎన్నో చెప్పవా?   
సీత: ఎండా కాలం, వానాకాలం, శీతాకాలం,..ఇంకా  పోయేకాలం!

8."కాయలు గాని  కాయలు ఏమిటి?"      "కోడి గాని కోడి ఏమిటి?     "కాయ గాని కాయ ఏమిటి?"    
"టపాకాయలు!"   "పకోడి!   "తలకాయ!"

9.టీచర్:సాగే  గుణం వేటికి  ఉంటుందిరా?       
స్టూడెంట్: టీవీ  సీరియల్స్ కు !

10.పుల్లయ్య: డాక్టర్ గారూ, మా అల్లుడికి పిచ్చి పట్టిందండీ!     
డాక్టర్: అలాగా, ఎక్కడున్నాడు అతను?!    
పుల్లయ్య: ఇదిగో,నా జేబులో!!

 11.  చెవులు నొప్పి! 
మూడేళ్ళ సృజన అంటోంది దీపావళి రోజు రాత్రి-
సృజన: అబ్బ! చేతులెంత నొప్పి పుడుతున్నాయో!
అమ్మమ్మ: ఎందుకమ్మా!‌అన్ని టపాకాయలు కాల్చావనా?
సృజన: ఉహుఁ..అంతసేపు చెవులు మూసుకున్నాను కదా, అందుకని!