ఈ బొమ్మను చూ డండి; ఈ కవితను చదవండి:
అన్న చేతిలో ఒక బంతి ఉంది,
జారి పాప దగ్గర పడింది.
పాపాయి బంతిని నెట్టింది,
నాన్న వద్ద అది ఆగింది.
పాపాయి పాకుతూ వెళ్ళింది,
పాప చెయ్యి తగిలి బంతి దొర్లింది.
బంతి అమ్మను చేరింది
పాపాయి కిల కిలా నవ్వింది!
మరి ఇప్పుడింక మీరూ ఈ బొమ్మకు ఓ కవిత రాసి పంపించండి- కొత్తపల్లి-64లో ప్రచురిద్దాం!