1. కార్పొరేట్ స్కూలు ప్రిన్సిపాలు నిజాయితీగా ఏమని చెప్తాడు ?
    "మీ అబ్బాయికి చదువొస్తుందని హామీ ఇవ్వలేను గానీ, ర్యాంకు వస్తుందని మటుకు హామీ ఇస్తున్నాను" అంటాడు!

  2. యల్ కే జీ లో పిల్లాడిని చేర్చటానికి వచ్చిన తల్లి దండ్రులను హెడ్మాస్టరు ఏమడిగాడు?
    "ఐ ఐ టీ యల్ కేజీ యా, ఆర్డినరీ యల్ కే జీ యా?” అని!

  3. అన్నిటికంటే పెద్ద సీలింగ్ ఫ్యాను ఎక్కడ ఉంటుంది?
    హెలికాప్టరు పైన!

  4. వినియోగదార్ల హక్కుల సంఘం ప్రెసిడెంటు డాక్టరును ఏమడుగుతాడు?
    ఆపరేషను చేసిన తర్వాత బిల్లుతో పాటు గ్యారంటీ కార్డు ఇమ్మంటాడు!

  5. బట్టతల వలన లాభం ఏమిటి?
    తల దువ్వుకునే శ్రమ తప్పుతుంది!

  6. ప్రాణం లేకపోయినా 'డెడ్' అయ్యేదెవరు?
    ఫోను!

  7. వర్షం పడుతున్నప్పుడు వెంగళప్ప ఏం చేస్తాడు?
    గొడుగు వేసుకొని మొక్కలకు నీళ్ళుపోస్తాడు!