1. తొక్కితే చాలు-తొంభై ఆమడలు పోతుంది. ఏమిటది?

2. ఆకాశంలో అంబు-అంబులో  చెంబు-    
    చెంబులో  చేరెడు నీళ్ళు, ఏమిటది?

౩. దేహమంతా  కన్నులేకాని దేవేంద్రుడుకాదు   
    భుజము మీద ఉంటుంది కాని బుడతకాదు    
    జీవంలేదు కానీ కదిలే జీవుల్ని పట్టి బంధిస్తుంది- ఏమిటది?

4. తెల్లని శరీరం-నల్లని టోపీ: ఏమిటది?

5. నూరు ఆవులు ఒక పేడకుప్ప  పెట్టాయి: ఏమిటది?

6. తెల్లని  పొలంలో  నల్లని విత్తనాలు-     
    చేత్తో  వేస్తారు; నోటితో  ఏరతారు: ఏమిటది?

7. ఆకాశంలో  ఎగురుతుంది కాని  పక్షి కాదు: ఏమిటది?





సమాధానాలు:

   1. సైకిల్   
2. మేఘం
3. వల
4. అగ్గిపుల్ల
5. తేనెతుట్టె
6. పుస్తకం
7. గాలిపటం