సెక్రటరీ ఉన్నాడుగా!
నాన్న: అబద్ధాలు ఆడకుండానే నువ్వు మంత్రివైనందుకు చాలా సంతోషం‌నాయనా!
రాజనాథం : నేను అబద్ధాలు ఆడకూడదనే కద నాన్నా, సెక్రటరీని పెట్టుకున్నది?!
సేకరణ: సుచరిత

చిలిపి ప్రశ్న-తిక్క జవాబు
టీచర్ : పోస్ట్ మాన్ ఉత్తరాలు ఎందుకు తీసుకు వెళ్తాడు?
రవి: వాటంతట అవి వెళ్లలేవు కాబట్టి!
సేకరణ: సుచరిత

కారు మతలబు!
గోపి: ఏంట్రా కారు కొన్నావట?
శివ: అవునురా! నడచి వెళ్తుంటే అప్పులోళ్లు వెంట పడుతున్నారు మరి- ఏంచేసేది?
సేకరణ: సుచరిత

ముల్లుకి ముల్లు!
టీచర్ : అదేంట్రా? కాలుకి ఇన్ని ముళ్లు ఎలా గుచ్చుకున్నాయి?
విద్యార్థి: మొదట ఒకటే గుచ్చు కుంది టీచర్. ముల్లును ముల్లుతోనే తీయమన్నారు గదా అని, ఒకదాని తర్వాత ఒక ముల్లు గుచ్చుకుంటూ పోయాను...చివరికి ఇన్ని అయ్యాయి.
సేకరణ: సుచరిత

నువ్వే గొప్ప!
కొడుకు: నాన్నా! కాకి అరిస్తే చుట్టాలొస్తారంటగా!
తండ్రి : అవున్రా.
కొడుకు : మరి, చుట్టాలు వెళ్లి పోవాలంటే ఎవరు అరవాలి?
తండ్రి : నువ్వు అరిస్తే చాలురా కన్నా!
సేకరణ: సుచరిత

విడ్డూరం!
డాక్టర్ : సారీ, గంట క్రితం హస్పిటల్‌కు తెచ్చి ఉంటే పేషెంట్ బతికేవాడు!
రంగా రావు: యాక్సిడెంట్ జరిగి అరగంట కూడా కాలేదండీ!
సేకరణ: సుచరిత

బడి బరువు!
టీచర్ : దూరపు కొండలు నునుపు - దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పు రామూ!
రాము : మా ఊరి బడిలో పాఠాలు సరిగా‌ చెప్పరని మా నాన్న ఈ ఊరి స్కూల్లో చేర్పించాడు.
సేకరణ: సుచరిత

మంచిబుద్ధి!
సన్యాసిరావు జైలర్ గా ఎందుకు సెలక్ట్ కాలేదు?
ప్రవర్తన బాగా లేని ఖైదీలను బయటకి గెంటేస్తానని ఇంటర్వూలో జవాబిచ్చాడు.
సేకరణ: సుచరిత

నాక్కూడా కావాలి ఇంకొంచెం తెలివి!
బాబు: అమ్మా! ఐస్ క్రీం కావాలి.
అమ్మ: వద్దు! జలుబు చేస్తుంది!
బాబు: ఊఁ.. నాక్కావాలి!
అమ్మ: వద్దన్నానా!? వద్దంటే ఊరుకోవాలి- అంతే!
బాబు: ఐస్ క్రీం తింటే తెలివి తేటలు పెరుగుతాయని మా టీచర్ చెప్పింది.
అమ్మ: అవునా?! ఐతే రెండు తీసుకురా- నీ కోటి నా కోటి!
సేకరణ: సుచరిత

నీ మాటే వేదం!
జడ్జి: ఎన్నిసార్లయ్యా, చెప్పేది!? మళ్లీ నాకు కనబడొద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు?
దొంగ : చాలా సార్లు చెప్పారు సార్! కానీ ఆ సంగతి పోలీసులకు ఎంత చెప్పినా వినకుండా లాక్కొచ్చారు సార్ నన్ను!
సేకరణ: సుచరిత

ఎవరు?!
టీచర్ : రామూ! దొర భార్యని "దొరసాని" అంటారు. మరి మంత్రి భార్యని?
రాము : మంత్రసాని , టీచర్.
సేకరణ: సుచరిత

చిలిపి ప్రశ్న-తిక్కజవాబు
డాక్టర్ కు ఇష్టమైన వాడు ఎవరు?
జేబునిండా డబ్బులు, ఒంటి నిండా జబ్బులు ఉండేవాడు.
సేకరణ: సుచరిత

చిలిపి ప్రశ్న-తిక్క జవాబు
నాయకుడు ఎవరు?
ఎన్నికల ముందు దానకర్ణుడు, ఎన్నికల తర్వాత కుంభకర్ణుడు!
సేకరణ: సుచరిత

అంతర్దృష్టి!
టీచర్ : హరీ ! నీ దగ్గర 20 గేదెలున్నాయనుకో, నేను మరో 20 గేదెలిస్తే ఏమౌతుంది?
హరి: నేను చదువు మానేసి గేదెలు కాయాల్సి వస్తుంది, టీచర్!
సేకరణ: సోమిరెడ్డి