ఈ బొమ్మను చూడండి.. దీన్ని చూస్తే మీకేమనిపిస్తున్నది?

కోతి, పాపం అలిసిపోయినట్లున్నది.
వేరే చోటేమీ దొరకలేదో, ఏమో-
చెట్టు కాండం మీదే నిద్రపోతోంది.
లేకపోతే దానికి ఏడుపు వస్తున్నదేమో-
చెట్టు కొమ్మను చేతిలో పట్టుకొని ,
కళ్ళు తుడుచుకుంటున్నదేమో.
మరి ఇది కోతి శాస్త్రవేత్త కావచ్చు:
ఏదైనా పరిశోధన చేస్తున్నదేమో-
విరిగిన వేపపుల్లలోంచి చూస్తే
ఈ ప్రపంచం వేరేగా కనబడుతుందేమో..

బహుశ: ఇక్కడేదో కథ దాక్కొని ఉండచ్చు! మాకు తెలుసు, మీకు తెలుసని! మీరు కనుక్కున్న ఆ కథని రాసి పంపించండి మాకు. అది బాగుంటే దాన్నే అచ్చు వేస్తాం, రెండు నెలల తర్వాత.

మా చిరునామా: కొత్తపల్లి, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా- 515101
  ఫోను: 08559 240495   ఇ-మెయిలు: team at kottapalli dot in