బుర్ బుర్ పాం పాం
బుర్ బుర్ పాం పాం
బుర్ -బుర్- పాం పాం (2)

డ్రైవర్ సీట్లోకూర్చుందెవరు
స్టీరింగ్ చక్రం తిప్పేదెవరు (2)
యాక్సిల్ చక్కలు తొక్కేదెవరు? (2)
ఇంకెవరెవరు..ఇంకెవరెవరు..
మాపాపే !
"బుర్ బుర్ పాం పాం "

ఏటి ఒడ్డున తోటలలోన
బీచు ఒడ్డున బాటలపైన
కారు షికారు పోయేదెవరు ? (2)
ఇంకెవరెవరు..ఇంకెవరెవరు...
మాపాపే !
"బుర్ బుర్ పాం పాం "

పల్లపు దారి చల్లగ జారి
మెట్ట దారిని మెట్టుగ ఎక్కి (2)
చదును దారిని సాగేదెవరు?
ఇంకెవరెవరు..ఇంకెవరెవరు..
మాపాపే !
"బుర్ బుర్ పాం పాం "

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song