అమ్మా అమ్మా చూడమ్మా
అదిగోమెరిసే ఇంద్రధనసు
నింగికి నేలకు ఎవరో
రంగులవంతెన వేశారే
రంగుల వంతెన వేశారే
"అమ్మా అమ్మా చూడమ్మా"
పై పై పైకి ప్రాకి
చందమామనే తాకిరానా?
అక్కడినుండి ఎగిరి
చుక్కలలోకం చూచిరానా?
"అమ్మా అమ్మా చూడమ్మా"
ఆ పక్క చూస్తే సూర్యుడు
పైనుండి పడే జల్లులు
ఈ పక్క మాపున ఇంద్రధనస్సు
నడుమ తడుస్తూ నేను భలేగా
"అమ్మా అమ్మా చూడమ్మా"
ఎరుపు నారింజ పసుపు పచ్చ
ఆకుపచ్చ నీలం ఆకాశ నీలం ఊదా
ఇంత చక్కని రంగుల వంతెన
వింతకాదటే ఓ అమ్మా?
వింతకాదటే ఓ అమ్మా!
"అమ్మా అమ్మా చూడమ్మా"