వెలుగులన్నింటిలోన ఏ వెలుగు చెప్పుడు
మా ఇంటి పాపలూ తిరగంగ వెలుగు
నవ్వులన్నింటిలోన ఏ నవ్వు వెలుగు
మా ఇంట పాపలూ నవ్వంగ వెలుగు
ఆటలన్నింటిలోన ఏ ఆట వెలుగు
మా ఇంట పాపల్లూ ఆడంగ వెలుగు
పల్కులన్నింటిలోన ఏ పల్కు వెలుగు
మా ఇంట పాపల పల్కులే వెలుగు
ఇంటింటా ఇంటింటా ఏవెలుగు వెలుగు
ఇంటింటా ఇంటింటా మాబాల వెలుగు.