వందనమో - భారతమా
అందరము నీ వారమమ్మా
మేమందరమూ నీ వారము
వినీల గగనపు వీధుల తాకెడి-
వింధ్య హిమాచల గిరిధారీ
విశ్వ వ్యాపినీ - విమల రూపిణీ
విజయ భారతీ సుతులమమ్మా
గలగల పారెడి గంగా సింధు
పదములు కడుగగ కావేరి
పుణ్య నదమ్ములు నిండిన పావన
పుణ్య మూర్తి పుత్రులమమ్మా
వీర శివాజి గురు గోవిందుల - పృథ్వీరాజ ప్రతాప సింహుల
ధర్మ రక్షకై దీక్షను బూనిన- ధీశాలుర వారసులమమ్మా
“వందనమో భారతమా"