బ్రదర్!
బిచ్చగాడు: అయ్యా! ఒక రూపాయి ఉంటే దానం చెయ్యండి బాబూ!
రామారావు: డబ్బు లేదోయ్ !
బిచ్చగాడు: ఏదైనా ఒక చొక్కా ఉంటే ఇవ్వండి బాబు!
రామారావు: అది కూడా లేదోయ్!
బిచ్చగాడు: అయితే రా బ్రదర్ , ఇద్దరం కలిసి అడుక్కుదాం.
కుతూహలం!
టీచర్: సూదితో గుచ్చితే రక్తం బయటకు ఎందుకు వస్తుంది చిన్నీ.
చిన్నీ: ఎవరు గుచ్చారో చూద్దామని టీచర్.
లైట్ వెయిట్!
తండ్రి : ఏరా! ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది. కొడుకు : చాలా తేలికగా ఉంది నాన్నా. తండ్రి : నేనడుగుతోంది దాని బరువు కాదమ్మా!
అసలు సుత్తి!
జడ్జి: సుత్తి ఆపు తల్లీ.
సావిత్రి: అది మీ చేతులోనే ఉంది కదండీ!
అనుకోవటం!
అపర్ణ: అందరూ నేను పొడవు దాన్ని అనుకోవాలి- ఏదైనా చిట్కా చెప్పు ప్లీజ్!
సలీమా: వెరీ సింపుల్, పొట్టి వాళ్లతో స్నేహం చెయ్!
ఒకే గొడుగు!
ఎండాకాలం : వర్షా భావం వల్ల రిజర్వాయర్లు ఎండిపోవడంతో అధికారికంగా విద్యుత్ సరఫరా 6 గంటలు తగ్గించడమైనది.
వర్షా కాలం : అధిక వర్షాల కారణంగా కరెంట్ తీగలు తెగి పడిపోయి-నందువల్ల విద్యుత్ సరఫరా నిరవధికంగా నిలిపివేయడమైనది.
పాత జోకే!
రాజు విమానంలో బాంబేకి వెళుతున్నాడు.అది ల్యాండ్ అవుతుంటే ఆనందంతో పెద్దగా అరిచాడు: " BOMBAY , BOMBAY” అని.
ఎయిర్ హాస్టెన్: బీ సై లెంట్.
రాజు: " OMBAY , OMBAY”
నలుపు-తెలుపు!
టీచర్: అన్నింటి కంటే పాత జంతువు ఏది?
స్టూడెంట్ : జీబ్రా సార్!
టీచర్ : ఎందుకని?
స్టూడెంట్ : అది ఇంకా నలుపు, తెలుపు రంగులోనే ఉంటుంది కాబట్టి.
అమాయకుడు!
మారుతి విదేశ యాత్ర ముగించుకొని, ఇంటికొచ్చాడు.
మారుతి: నేను ఫారెనర్ లా కనిపిస్తున్నానా!?
మారుతి భార్య : లేదే , ఎందుకలా అడిగారు?
మారుతి : ఏం లేదు, లండన్ లో నన్ను చాలా మంది 'నువ్వు ఫారెనర్ వా?' అని అడిగారెందుకు, మరి?
సున్నకు కొత్త విలువ!
రవి : ' సున్నకు ' విలువ లేదా?
గోపి: లేదు.
రవి: సున్న పక్కన సున్న పెడితే?
గోపి : ఏమీ కాదురా!
రాము: సున్నం అవుతుంది గదరా?
తేడా!
టీచర్ : ఆపిల్ పండు క్రింద పడగానే 'ఎందుకు క్రిందకు పడిందా' అని న్యూటన్ ఆలోచించాడు కదా, మరి నువ్వైతే ఏమి అనుకునేవాడివి?
స్టూడెంట్ : పడగానే తినేసి, రెండోది ఎప్పుడు పడుతుందా, అని చూస్తుంటా!
పిల్లల గతి!
మహేష్ : ఒరే రామూ ! పొద్దున్న నానమ్మ ఇంటికి , సాయంత్రం అమ్మమ్మ ఇంటికి భోజనానికి వెళుతున్నావు, మీ అమ్మా ,నాన్నలు ఊర్లో లేరా?
సురేష్ : ఉన్నారు...
మహేష్ : మరేమి? మీ అమ్మా నాన్నల మీద అలిగావా? మీ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు?
సురేష్ : మా అమ్మేమో నాన్న మీద అలిగి వాళ్ళ పుట్టింటికి వెళ్లింది. నాన్నేమో అమ్మ మీద అలిగి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాడు. అందుకే నేను రెండు ఇళ్లకీ వెళ్తున్నాను రోజూ!
తుప్పు జోకు!
భర్త : నా కెందుకో భయంగా ఉందే!
భార్య : ఎందుకు?
భర్త : నెల రోజుల నుండి ఐరన్ టానిక్ తాగుతున్నాను కదా, ప్రేగులు తుప్పు పడతాయేమోనని.