ఎల్లలెరుగని వాళ్ళము - కల్లలెరుగని వాళ్ళము
బాలలం మేమొక్కటే లోకమూ మా కొక్కటే

గోధుమరంగున కొందరు-
పసుపువన్నె ఇంకొందరు
తెలుపు, నలుపు, ఆపిల్ ఎరుపూ
ఏరంగైనా ముచ్చట గొలుపు
రంగేదైనా‌, రూపేదైనా
నివసించే ఆ చోటేదైనా
బాలలం మేమొక్కటే
లోకమూ మాకొక్కటే "2"

అన్నం, పప్పు, చారూ, కూర శాఖాహారం తినువారైతే
తిండేదైనా, తీరేదైనా తినగోరే ఆ రుచులేవైనా
బాలలం మేమొక్కటే లోకమో మాకొక్కటే "2"

అవునంటారు, ఎస్ అంటారు.
'ఒకే, టాటా' అందురుకొందరు.
'సీ' 'దేఖో' 'జా' అంటూ
పలువిధాలుగా పలుకుచుందురు
మాటేదైనా, పాటేదైనా
పెదాలు కలిపే భాషేదైనా‌
బాలలం మేమొక్కటే
లోకము మాకొక్కటే "2"

దేశాల్ వేర్వేరైనా కాని
సందేశం మాదిదే ఇదే
సంతోషంలో సకల ప్రపంచం
పకపకలాడాలన్నదే
బాలలం మేమొక్కటే
లోకమూ మాకొక్కటే "2"

"ఎల్లలెరుగని వాళ్ళము"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song