నాదు జన్మభూమి కంటె
నాకమెక్కడుంది?
సురలోక మెక్కడుంది? “నాదు”
అమరేంద్రుడు, గంధర్వులు
అచ్చరులును మచ్చరులు
వేడుకగా వలస వచ్చి
విహరించే హిమశృంగం “నాదు”
కాళిదాసు కంటి కొసల
పసిడి కళల పూలబాల
మనగిరి ధర ధామం
స్వర్గ సీమలో ఎక్కడ “నాదు”
పచ్చని సశ్యామల సుశ్యామల
పసిడి సీమ మనదు ధరణి “నాదు”
చందనమును మరపించు
అమర ధామము
పసిడి పంటలకు ఇదియే ఆలవాలము “నాదు”