ముస్లిం హిందూ పిల్లలారా
ముందుకు పోదాం రారండోయ్
భారత దేశం మనదే మనదే
బజావోఢంకా బాలల్లారా “ముస్లిం హిందూ”
హిందూ క్రై స్తవ బాలల్లారా
భారత దేశం మనదేమనదే
చీటికి మాటికి జగడాలాడే
తాతల మాటల వినకండోయ్
ముస్లిం హిందూ పిల్లల్లారా
హిందూ క్రైస్తవ బాలల్లారా
ముందుకు పోదాం రారండోయ్!
శూరుడు శివాజి వీరుడు బోసు
భారతీయులే బాలల్లారా
భావి కాలమున భారత భామిని
బాల వీరులే పాలించాలోయ్
ముస్లిం హిందూ పిల్లల్లారా
హిందూ క్రైస్తవ బాలల్లారా
ముందుకు పోదాం రారండోయ్!
పదండి పదండి ముందుకు
భారత దేశం మనదే మనదే “”ముస్లిం హిందూ"