రంగు రంగుల పువ్వుల్లాంటి పిల్లలారా
హరివిల్లుల్లారా-
వచ్చింది వచ్చింది వానాకాలం
వచ్చింది వచ్చింది వానాకాలం
సెలవుల కాలం గడిచి-
మళ్లీ బళ్లు తెరిచారు
బద్ధకానికి మొద్దు నిదురకు
స్వస్తి చెప్పి మేలుకోండని
గర్జిస్తూ ఆకసాన
తెలితెలి మబ్బులు చెబుతున్నాయి-
విన్నారా విన్నారా విన్నారా ?
"రంగు రంగుల"
వడగాడ్పులకు ఓర్వలేక
ఉసురుసురంటూ ఊసుపోక
అల్లరిచేయక ఇళ్లలోనే
ఇరుక్కుపోయిన పిల్లలారా
చిందులు వేస్తూ రారండంటూ
చిటపట చినుకులు పిలుస్తున్నాయ్-
విన్నారా విన్నారా విన్నారా?
"రంగు రంగుల"
ఊరకనే అలసట చెందే
వేసవికాలం వెళ్లింది
కొత్త క్లాసులు పుస్తకాలు
చూస్తే వచ్చును మీకే హుషారు
రంగు రంగుల బట్టలు వేసుకు
రండి పిల్లలారా అంటూ
తొందర చేసే ఇంద్రధనస్సును
చూశారా చూశారా చూశారా ?
"రంగురంగుల"