ఈ బొమ్మను చూడండి: మీకేమనిపిస్తున్నది?       
   చాలా దట్టమైన అడవిలో చిలకమ్మ, ఎందుకనో ఏడుస్తున్నది.  క్రింద పొదలో పెద్దపులి మాటు వేసి పొంచి ఉన్నది- ఎవరికోసమో?!      
   చిలకమ్మను ఏడిపించింది పెద్దపులేనా?      
   కాదేమో- చూస్తుంటే చిలకమ్మా, పెద్దపులీ స్నేహితుల్లాగా ఉన్నాయే?!    
   మీకేమైనా ఐడియాలొచ్చాయా, ఈ బొమ్మను చూశాక?     
   ఏదైనా కొత్త కథ ఒకటి తట్టిందా, మీ మనసుకు?  వెంటనే కాయితం, పెన్నూ పట్టండి. ఆ కథను రాసి మాకు పంపించేయండి.    
   మా దగ్గర ఈ బొమ్మకు సరిపోయే కథ ఒకటి ఉన్నది- దానికంటే మీ కథ బాగుందనుకోండి,  మీ కథనే  కొత్తపల్లి పత్రిక ఆగస్టు సంచిక లో ప్రచురిస్తాం!
మీ కథలు, ఐడియాలు  పంపించాల్సిన చిరునామా:       
   కొత్తపల్లి, యం ఆర్ వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101    
    ఇ-మెయిలు: team at kottapalli dot in.
