క్వాక్ క్వాక్ క్వాక్! క్వాక్ క్వాక్ క్వాక్!    
   క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్ క్వాక్!
ఓహో బాబూ ఓహో పాపా   
   ఓహో బాబూ ఓహో పాపా   
   ఎక్కడికెళుతున్నారర్రా?    
   అని బళ్ళోకెళ్ళే బాబుని పాపని    
   దార్లో ఒక బాతడిగింది   
క్వాక్ క్వాక్ క్వాక్! క్వాక్ క్వాక్ క్వాక్!   
   క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్ క్వాక్!   
పాఠం చెప్పే పంతులుగారికి    
   పళ్ళీయడానికి వెళ్తున్నామని    
   బాతు భాషలో పాపంటే విని   
   బాబు ఫకాలున నవ్వాడు    
చిట్టి చేతిలో పళ్ళు పుచ్చుకొని    
   పొట్టి కాళ్లతో గునగూన ఊగుతు    
   బాతుల్లాగే పోతున్నారే     
   నాతో నేస్తం కడతారా?    
   అని బళ్ళోకెళ్ళే బాబుని పాపని     
   దార్లో ఆ బాతడిగింది    
నేస్తం నీతో కడితే   
   మాకేమిస్తావో చెబుతావా బాతూ?     
క్వాక్ క్వాక్ క్వాక్! క్వాక్ క్వాక్ క్వాక్!     
   క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్      
   అంటూ బాతు భాషలో బాతంటే విని      
   బాబు ఫకాలున నవ్వాడు     
బళ్ళోకెళుతూ నేస్తం కడితే     
   దార్లో సాయం వస్తానర్రా     
   చెర్లో తామరలిస్తానర్రా     
   బళ్ళో పంతులుకివ్వండంటూ     
   బళ్ళోకెళ్ళే బాబుని పాపని      
   దార్లో ఆ బాతడిగింది     
'క్వాక్ క్వాక్ అంటుందేమిటి బాతు-     
   అక్కా?' అని  బాబడిగాడప్పుడు     
క్వాక్ క్వాక్ అంటే గమ్మత్తు కాదు     
   చక్కని బాతుల భాషరా అది     
   క్వాక్ క్వాక్ క్వాక్! క్వాక్ క్వాక్ క్వాక్!      
   క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్- క్వాక్ క్వాక్ క్వాక్!    
   బాతు భాష అని పాపంటే విని   
   బాబు ఫకాలున నవ్వాడు!   
   బళ్ళోకెళ్ళే బాబూ పాపా బాతూ నేస్తం కట్టారు.