దొందూ దొందే!     
   తండ్రి :  అబ్బాయి  నచ్చాడా  అమ్మా!    
   కూతురు: నచ్చాడు కానీ  కొంచెం.. నవ్వినప్పుడు  పళ్ళు  ఎత్తుగా  కనిపిస్తున్నాయి నాన్నా!    
   తండ్రి :  నిన్ను  చేసుకున్నాక  ఇంకెక్కడ  నవ్వుతాడు లేమ్మా, ఈ సంబంధాన్నే ఖరారు చేస్తాను.    
:):):)
పేరయ్య:  అమ్మాయి  నచ్చిందా, బాబూ?      
   అబ్బాయి: నచ్చింది, కానీ  ఒక్కటే సమస్య.. నవ్వినప్పుడు  పళ్ళు  ఎత్తుగా  కనిపిస్తున్నాయి గదండీ.     
   పేరయ్య :  నిన్ను  చేసుకున్నాక  ఇంకెక్కడ  నవ్వుతుంది  లేవయ్యా, ఈ సంబంధాన్నే ఖరారు చేస్తాను.     
   
                                    
మెడల్ కొట్టేశా!    
   కొడుకు(ఫోన్లో): నాన్నా! నేను చైనా  ఒలింపిక్స్ లో  గోల్డ్ మెడల్ కొట్టేశాను. ఒక ఐదు లక్షల రూపాయలు పంపించు.    
   తండ్రి: చాలా సంతోషం నాయనా, ఇప్పుడెక్కడున్నావు?     
   కొడుకు: చైనాలో నన్ను వీళ్ళు జైల్లో పెట్టారు నాన్నా. ఇప్పుడు అక్కడే ఉన్నాను.    
   తండ్రి (గాభరాగా): అదేంటిరా! గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్లని జైల్లో పెడతారా వాళ్ళు?    
   కొడుకు(అమాయకంగా): అదే నాన్నా, నేనూ అడుగుతున్నాను. పక్కవాడికి వచ్చిన మెడల్‌ను కొట్టేస్తే  జైల్లో పెడతారట ఇక్కడ! నాకేం తెలుసు ఆ సంగతి?     
   
హోటల్ బేరం!      
   హోటల్లో పనిచేసే వెంగళప్ప కోర్టుకు వెళ్ళాడొక సారి-    
   జడ్జి: ఆర్డర్, ఆర్డర్......      
   వెంగళప్ప : దోసె, వడ, ఇడ్లీ, ఉప్మా, పూరీ ....      
   జడ్జి : షటప్.      
   వెంగళప్ప:  అది లేదు సార్! సెవెన్ అప్ మాత్రం ఉంది- తెమ్మంటే తెస్తాను.     
   
సంక్రాంతి కాలం!     
   భర్త : ఇంత రాత్రి  మేడపైన కూర్చుని  ఆకాశంలో  చుక్కలు  చూస్తూ  ఏం  ఆలోచిస్తున్నావు?    
   భార్య: ఆకాశంలోని  చుక్కలన్నింటినీ   కలిపితే  ఎంత  ముగ్గవుతుందా అని!     
   
తప్పయిందే!     
   అమ్మ: పండూ ! డబ్బాలో  నాలుగు  మిఠాయి లుండాలి , ఒకటే  ఉందే?     
   పండు: అరెరే! ఇంకోటి ఉందా, నేను మూడే తిన్నానే మరి?!     
   
ఒకటే మార్గం!      
   హరిని: ఏమండీ! ఇక్కడ  సుబ్బారావు  గారి  హాస్పిటల్ కు  ఎలా  వెళ్లాలండీ?    
   గిరి (కోపంగా):  ఏదో  ఒక  రోగంతోనండీ.    
   
అబద్ధం!
   లాయర్ : యువరానర్ ! ఈ ముద్దాయి   హత్య   చేస్తునప్పుడు  మొత్తం  కాలనీ   కాలనీ  అంతా  చూసింది.         
   యుద్ధాలు : ఈ లాయరప్ప అంతా అబద్ధమే చెబుతున్నాడు సార్! నేను  ఎవరూ  చూడకుండా అన్ని   ఏర్పాట్లూ  చేసుకున్నాను!    
   
పేరు కుంపటి!
   బ్రహ్మనందం: ఏంట్రా ! వేరు కుంపటి పెట్టావట, ఏమైనా గొడవలా?    
   సునీల్: కుంపటి ఎక్కడుందిరా, అది దొరక్క  గ్యాస్ పోయ్యే  పెట్టుకున్నాను.     
   
గొడుగు భద్రం!    
   తల్లి: ఒరేయ్ వానలో  తడుస్తూ  వెళుతున్నావ్-  గొడుగు  తీసుకెళ్లరా!     
   కొడుకు: అమ్మో, కొత్త  గొడుగు  తడిసిపోదూ...!    
   
మ్యాజిక్కు!      
   ప్రొప్రయిటర్: ఆ మెజీషియన్ ని  ఎందుకు  రానిచ్చావయ్యా,  మన  హాటల్ కి ?     
   సర్వర్: ఏమైంది సార్?      
   ప్రొప్రయిటర్: భోం చేసి  డబ్బులివ్వకుండా  మాయమై పోయాడు- ఇప్పుడేం చేద్దాం?       
   
చిలిపి ప్రశ్నలు-తిక్క జవాబులు
   ప్రశ్న: తెలివైన గవర్నమెంటు ఉద్యోగి ఆఫీసుకు ఎందుకు వెళ్తాడు?   
   జవాబు: నిద్రపోయేందుకు.    
   
   ప్రశ్న: నేటి  రాజకీయ నాయకుల  ఆలోచనా  స్థితి  ఎలావుంది!?     
   జవాబు: దూరాలోచనకు  తక్కువ; దురాలోచనకు  ఎక్కువ!!     
   
   ప్రశ్న: తెలివైన  టి.వి. ఛానల్  యజమాని  ఏం చేస్తాడు!?     
   జవాబు: మధ్యాహ్నం  "మా  ఛానల్  వంట"  కార్యక్రమం తర్వాత  స్టాఫ్ కి  "ఉచిత  భోజన  సౌకర్యం "   అని   ప్రకటిస్తాడు!!
   
