ఈ బొమ్మను చూడండి: మీకేమనిపిస్తున్నది?
చాలా దట్టమైన అడవిలో చిలకమ్మ, ఎందుకనో ఏడుస్తున్నది. క్రింద పొదలో పెద్దపులి మాటు వేసి పొంచి ఉన్నది- ఎవరికోసమో?!
చిలకమ్మను ఏడిపించింది పెద్దపులేనా?
కాదేమో- చూస్తుంటే చిలకమ్మా, పెద్దపులీ స్నేహితుల్లాగా ఉన్నాయే?!
మీకేమైనా ఐడియాలొచ్చాయా, ఈ బొమ్మను చూశాక?
ఏదైనా కొత్త కథ ఒకటి తట్టిందా, మీ మనసుకు? వెంటనే కాయితం, పెన్నూ పట్టండి. ఆ కథను రాసి మాకు పంపించేయండి.
మా దగ్గర ఈ బొమ్మకు సరిపోయే కథ ఒకటి ఉన్నది- దానికంటే మీ కథ బాగుందనుకోండి, మీ కథనే కొత్తపల్లి పత్రిక ఆగస్టు సంచిక లో ప్రచురిస్తాం!
మీ కథలు, ఐడియాలు పంపించాల్సిన చిరునామా:
కొత్తపల్లి, యం ఆర్ వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101
ఇ-మెయిలు: team at kottapalli dot in.