తొలకరి జల్లులు జీవంరా
మొలకలు పంటకు ప్రాణంరా
వానలు బాగా కురవాలంటే
వనములు మనము పెంచాలి
”తొలకరి"
మట్టిలొ దాగిన వేర్లన్నీ
చెట్టుకు నీటిని ఇస్తాయి
చెట్టులొ చేరిన నీరంతా
ఆకులలోనికి పోతుంది
"తొలకరి"
సూరీడు ఆకులపై
వేడెంతో విడువంగా
ఆకులలోని నీరంతా
ఆవిరిగా మారుతుంది
"తొలకరి"
ఆవిరి మేఘం అవుతుంది
నల్లని మబ్బైపోతుంది
చిటపట చినుకుల ఒరవడిలో
చల్లని జల్లై పడుతుంది
"తొలకరి"
వడివడిగా ఒక ఒరవడిగా
కురిసేటి ఆ వర్షాలు
అడవుల్లో అల్లుకుపోయిన
ఆకులపై పడతాయి
"తొలకరి"
ఆకులపై నిలచిన నీరు
ఎండకు ఆవిరి అవుతుంది
అందుకనే అడవుల్లో
తరచుగ వానలు వస్తాయి
అందుకే-
వానలు మనకు కావాలంటే
వనములు మనము పెంచాలి.
"తొలకరి జల్లులు జీవంరా.."