వానకాలం వచ్చింది,
నింగీ-నేల పులకించాయి(3)
"వానకాలం వచ్చింది "
ఆకాశంలో అక్కడక్కడ
అందమైన హరివిల్లులు విరిసె(2)
నేలయంతటను అప్పుడప్పుడు
ముత్యాల తొలకరి జల్లులు కురిసె(2)
"వానకాలం వచ్చింది"
ఉరుముతు మెరుపుల కన్నులు తెరచి
నింగే నిద్దుర లేచింది(2)
పచ్చిక బయ్యళ్ళ, పారే ఏరుల
నేలే నూతన రూపం దాల్చె(2)
"వానకాలం వచ్చింది"