నెమలీ నెమలీ నాట్యమాడవే,
ఒంపు సొంపుల వయ్యారాలతో(2)
ఉరుముల గంటలు మెడలో కట్టుకు
పరుగిడు ఆ... మబ్బులే(2)
మెరుపుల కన్నులు తెరచుకొని(2)
నిలిచెను ఒకపరి నిన్ను చూడగా
"నెమలీ నెమలీ "
ఎండకు వానకు వెలియని నలుగని
రంగు పూల పురి పట్టు పావడా(2)
సింగారించుకు సరినాకెవరని(2)
అడుగులు వేసే అందాల రాశి
" నెమలీ నెమలీ "
నటరాజు ఇంటనే నాట్యం నేర్చి
ఇలకరుదెంచిన ఇంద్రనీలమా(2)
హరివిల్లులతో ఆకాశం (2)
వేదిక వేసెను నీ కోసం
"నెమలీ నెమలీ "
ఈ పాట వీడియో రూపాన్ని ఇక్కడ చూడచ్చు.