
ఒక రోజు ఐస్‌క్రీం పోతూ ఉంది.
పెద్ద గాలి వచ్చింది.
కొంచెం ఐస్‌క్రీం ఎగిరిపోయింది.
మళ్ళీ పోతా పోతా ఉంటే వానొచ్చింది.
గొడుగు తీసేలోపల కొంచెం ఐస్‌క్రీం బురదలో పడిపోయింది.
వాన తగ్గింది. ఐస్‌క్రీం గొడుగు ముడిచింది.
ఇంతలో ఎండ వచ్చింది!
వేడికి ఐస్‌క్రీం అంతా కరిగిపోయింది!
అయితేనేమి..?..
ఐస్‌క్రీం నేరుగా అలా అలా ఆవిరై, చందమామ దగ్గరికి వెళ్లింది.
అందుకే చందమామ- చల్..ల్.......ల్లగా ఉంటాడు!