1. చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది?
  2. నేలపై పడేస్తారు కానీ లేపలేరు?
  3. చలివేయక పోయినా ఒంటిమీద బట్టలు కప్పుకునే జంతువు?
  4. కాళ్ళులేవు, కదలలేదు కానీ ఏ ఊరైనా వెళుతుంది?
  5. ఒళ్ళంతా కన్నులు; పొట్ట నిండా గింజలు- ఏంటది?
  6. అందమైన వెండి కంచం కొన్ని రోజులు కనిపిస్తుంది, కొన్నిరోజులు మాయమైపోతుంది...?
  7. ఎంత దూరం నెట్టితే అంత దగ్గరౌతుంది- ఏంటది?
  8. కారుగాని కారు పరుగులో జోరు?
  9. మూట విప్పితే ముక్కు పట్టుకుంటుంది?
  10. రెండు అంగుళాల గదిలో యాభై మంది దొంగలు ..?!









పొడుపు కథలకు సమాధానాలు:
1. వాసన 2. ముగ్గు 3. గంగిరెద్దు 4. ఉత్తరం 5. సీతా ఫలం
6. చంద్రుడు 7. ఉయ్యాల 8. పుకారు 9. ఇంగువ 10. అగ్గిపెట్టె