చిన్నదే!
టీచరు: రాజూ, సముద్రానికీ, మహాసముద్రానికీ తేడా ఏమిటో చెప్పు?
రాజు: 'మహా' టీచర్!

బెత్తెడు!
ప్రపంచ పటాన్ని వివరించాక ,
సోషల్ టీచరు : రాజూ! భారత్ - అమెరికా ల మధ్య దూరం సుమారుగా ఎంత?
రాజు: ఆ .. ఆ... జానెడుకు కొంచెం ఎక్కువ, మూరెడుకు కొంచెం తక్కువగా ఉన్నట్లు కనబడుతోంది సార్!!

చిలిపి!
టీచరు: రాజూ, ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో చెప్పు?
రాజు: ఊరుకోండి టీచర్! మీకు తెలీనట్టు, అన్నీమమ్మల్ని అడుగుతారు!!

సామరస్యం!
టీచరు: ప్రతీ ఆదివారం గోళ్లు కత్తిరించుకోవాలని నిన్న చెప్పాను. ఎందుకో చెప్పు టింకూ?
టింకు: పిల్లలంతా ఒకరినొకరు గీరుకోకుండా ఉండాలని కదండి టీచర్!!

రెండు!
టీచర్: గుర్రానికి, ఏనుగుకి తేడా చెప్పురాజూ
రాజు: గుర్రానికి వెనుకమాత్రమే తోక ఉంటుంది, ఏనుగుకు ముందు.వెనుక తోకలుంటాయి!

ఎన్నోసారి?
వెంగళప్ప: బాబూ ఏం చదువుతున్నావు?
సాత్విక్: బీటెక్ నాలుగవ సంవత్సరం...
వెంగళప్ప: కనీసం ఈ ఏడాదైనా బాగా చదివి పాస్ అవుతావా?!

!పొదుపు!
మేనేజర్: ఏంటయ్యా ఆ ఫీసులో సమయం వృధా చేయకూడదని చెప్పానుగా!
వెంగళప్ప: అందుకే సార్ గడియారంలో బ్యాటరీ తీసేశా!!

ఒకరికోసం ఒకరు!
రామయ్య: నీకోసం మీ ఆవిడ పూజలు చేస్తుందటకదా! మరి ఆవిడకోసం నువ్వేం చేస్తున్నావు, బాబూ?
ప్రసాద్: అప్పులు!

చక్కని సమాధానం!
టీచరు : మెదడువాపు వ్యాధి గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి?
హరి: మనకు మెదడుంది కదా, టీచర్?... అందుకే!!

మరేం!
పళ్ల డాక్టరు: మీ ఇంట్లో ఏం పేస్టు వాడతారు?
వెంగళప్ప భార్య: అల్లం వెల్లుల్లి పేస్టు డాక్టర్!

ముందు జాగ్రత్త!
సుమిత్ర: డాక్టరిచ్చిన మందుబిళ్ళను ఎందుకలా నాలుగువైపులా కత్తిరిస్తున్నావు?
వెంగళప్ప: సైడ్ ఎఫెక్టులు రాకుండా ఉండటానికి!

చిలిపి ప్రశ్నలు-తిక్క జవాబులు

ఏది చివర?!
ప్రశ్న: ఇంద్రధనస్సు లో చివరిది ఏది?
జవాబు: 'స్సు'

గెలుపు-ఓటమి
ప్రశ్న: ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించాలంటే ఏం చేయాలి?
జవాబు: గెలవాలి!

గొప్ప తల!
ప్రశ్న: ఏ ఆటగాడు అందరికన్నా పెద్ద హెల్మెట్ ధరిస్తాడు?
జవాబు: పెద్ద తల ఉన్నవాడు!

ఆపండి! ప్రశ్న: బస్ స్టాప్ కన్నా ముందే బస్సును ఆపాలంటే ఏం చేయాలి?
జవాబు: బ్రేక్ వేయాలి!

అయ్యో, దేవుడా!
ప్రశ్న: టన్ను బంగారం బరువు ఎక్కువా, టన్ను దూది బరువు ఎక్కువా?
జవాబు: రెండూ సమానమే!

శాస్త్రీయం!
ప్రశ్న: పంచదార ఎందుకు తియ్యగా ఉంటుంది?
జవాబు: నాలుకకు తీపి రుచి తెలుస్తుంది కాబట్టి!