నన్ను ఈ లోకానికి పరిచయం చేసిన మా అమ్మ
నా కలల నాటకంలో ఓ ప్రధాన బొమ్మ
అమ్మను నాకు ప్రసాదించిన ఆ దైవం
మా అమ్మను నాకు అందించి, కోరికలు నెరవేర్చిన 'దివ్వెల దీపం'
నా నేస్తం మా అమ్మ, నా ప్రాణం మా అమ్మ
నాకు ఊపిరి పోసిన దేవదూత మా అమ్మ

తొమ్మిది నెలలు నీ కడుపులో దాచుకుని పోషించావు
నీ వృద్ధాప్యంలో నీకు ఆధారం అవుతానని అనుకుంటావు
వెచ్చని నీ ఒడిలో పడుకోవాలని ఉంది
కానీ ఎదిగిన వయసు, తిరిగిన కాలం నన్ను నీ ఒడికి దూరం చేశాయి.
మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ నీ పుత్తడి బొమ్మలానే పుడతాను
మళ్లీ మళ్ళీ నీ గారం, నీ ప్రేమ ఆస్వాదిస్తాను.