భారతదేశపు బాలలం భావి తరాలకు వారసులం ఆటా పాటా మాహక్కు సమతాభావం మాదిక్కు తరతరాలకూ యుగయుగాలకూ తరగనిదీ మా ప్రగతి |భారతదేశపు| విద్యా, జ్ఞానం మాలక్ష్యం ఆటా పాటా మా నైజం సాధన విద్యే మా దైవం సమభావానికి ప్రతిరూపం |భారతదేశపు| తెలుగు తల్లికీ వందనం తెగిపోనిది మా అనుబంధం చీకటిలో చిరుదివ్వెలం చెరిగిపోనిదీ మా స్నేహం |భారతదేశపు|