పోస్టు కార్డు
గానం: రాశి, శిరీష, నాలుగవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా
డప్పు: పోతలయ్య, ఏడవ తరగతి.
పోస్టుకార్డూ పోస్టుకార్డూ
పొయ్యొస్తావా?
పల్లె నుండి ఢిల్లీకి
పారిపోతావా?
ఢిల్లీ నుండి పల్లెటూరికి
తిరిగొస్తావా?
|పోస్టుకార్డూ|
పొట్టి బావకు చిట్టి మరదలి
ఫొటో ఇస్తావా?
మామ బిడ్డకు నా మంచి
మాట చెప్తావా?
|పోస్టుకార్డూ|
చిన్ని చెల్లికి అన్నమాట
చెవిలో వేస్తావా?
అత్తామామకు అల్లుడొచ్చే
వార్త చెప్తావా?
|పోస్టుకార్డూ|
పోస్టుకార్డూ పోస్టుకార్డూ
పోయిరామ్మా!
పోయిరామ్మా!
పోయిరామ్మా!
వ్యాఖ్యలు వారి సౌజన్యంతో