కావ్ కావ్
    
గానం: పోతిరెడ్డి, నాలుగవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: పోతిరెడ్డి, ఏడవ తరగతి.
 
  
కావ్ కావ్ అంటే ఏమమ్మా?
ఆకలి! ఆకలి! అన్నమ్మా!
అన్నం ఇదిగో, కాకమ్మా!
కడుపు నిండెను కన్నమ్మా!
మ్యావ్ మ్యావ్ అంటే ఏమమ్మా?
దప్పీ! దప్పీ! తల్లెమ్మా!
పాలు ఇవిగో పిల్లెమ్మా!
కడుపు నిండెను కామమ్మా!
భౌ భౌ అంటే ఏమయ్యా?
పారా హుషారు పాపయ్యా!
ఎక్కడ దొంగలు కుక్కయ్యా?
దౌడో! దౌడూ! తరుమయ్యా!
అంబా అంటే ఏమమ్మా?
నిద్దుర నిద్దుర నీలమ్మా!
జో! జో! జో! జో! దూడమ్మా!
హాయీ! హాయీ! హాయమ్మా!
కొకురోకో అంటే ఏమయ్యా?
మేల్కో మేల్కో మేలయ్యా!
గణ గణ గణ గణ గంటయ్యా
పరుగో! పరుగో! బడికయ్యా!
 
వ్యాఖ్యలు  వారి సౌజన్యంతో