చిన్ని చిన్ని పిల్లలం 
మల్లెపూల మొగ్గలం
మల్లెపూల మొగ్గలం
రంగు రంగు మొగ్గలం

ప్రకృతి అందాలు చూద్దామా
పరవశించి గంతులేద్దామా
|ప్రకృతి అందాలు చూద్దామా|

|చిన్ని చిన్ని పిల్లలం|

స్వాతి చినుకుల్లో
మనమూ ఒక చినుకౌదామా
|స్వాతి చినుకుల్లో|

సీతాకోకచిలకల్లో
మనం ఒక చిలకౌదామా
|సీతాకోకచిలకల్లో|

సిరివెన్నెల్లో చిందులేద్దామా
వెన్నెల్లో సగమౌదామా?

|చిన్ని చిన్ని పిల్లలం|
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song