1.

రంగడు, పింగడు, ఎంత తొక్కినాకానీ అణగడు. ఎవడువాడు?

2.

బావిలో నిమ్మకాయ తేలాడేను. ఏంటది?

3.

పిఠాపురం చిన్నవాడ
పిట్టలు వేటాడేవాడ
బతికిన పిట్టను కొట్టవద్దు
చచ్చిన పిట్టను తేనూవద్దు
కూరకు ఏం తేకుండా నువు 
ఇంటికి రానూ వద్దు
డబ్బాలో జింతాత జింతాత జింతాత
ఏమ్ చేస్తావో నువ్వు
ఏం తెస్తావో నువ్వు

జవాబులు:

ఒకటవ ప్రశ్నకు జవాబు: నీళ్లు

రెండవ ప్రశ్నకు జవాబు. వెన్న

మూడవ ప్రశ్నకు జవాబు : గుడ్డు