గానం: భారతి, శారద, తొమ్మిదో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
మాదే ఈ తరం వందేమాతరం,
మాదేఈతరం వందేమాతరం
జైహిందను జైహిందను మానినాదం
మా ఐకమత్యమే మా ప్రబోధం
వీరులం విధాతలం విశాల హృదయులం
వీరులం విధేయులం వివేకవంతులం ||వీరులం||
ఎత్తుకెదిగెవరకూ హద్దులేనెలేదు
ఒక్కటేలె శ్వాస, రేపుమీద ధ్యాస
ఏదేశమూ బాల సంక్షేమము
సాధించునో అదే ప్రగతి గాంచును ||మాదే ఈతరం||
శూరులం, వినూత్నులం విరత్నకాంతులం
పిల్లలం పునీతులం ప్రధాన పాత్రులం ||శూరులం||
చేతకానిదేలేదు చెయ్యలేనిదేలేదు
చేతకానిదేలేదు చెయ్యలేనిదేలేదు
మాబాలలే మీకు ఆదర్శము
మాబాటలో మిమ్ము నడువమందుము ||మాదే ఈతరం||