మన గ్రామీణ సమాజం మనుగడ వృత్తిపనివారిపై ఆధారపడి ఉన్నది, ఈ నాటికీ. అయితే పట్నాల్లో పిల్లలకు మాత్రం అసలు వీరు ఎవరో కూడా తెలీటం లేదు ఈ కాలంలో. మారుతున్న సమాజపు విలువల్లో మనుషులు పోయి, యంత్రాలు చేరుకుంటున్నాయి. వృత్తిపనివారిని మనందరికీ గుర్తుచేసే ఈ పాటను వినండి, కొంచెం అలోచించండి.
గానం: వరలక్ష్మి, మూడో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి
ఎంతో మంది పనివాళ్ళు, అంతామంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్న, కొడవలి పట్టిన కొండమ్మ
||ఎంతోమంది||
గుడ్డలు నేసే గురవయ్య, బట్టలు ఉతికే బాలన్న
||ఎంతోమంది||
కుండలు చేసే కొమరయ్య, కొలిమిని ఊదే కోనయ్య
||ఎంతోమంది||
చెప్పులు కుట్టే చెన్నయ్య, దుస్తులు కుట్టే మస్తాను
||ఎంతోమంది||
చదువును నేర్పే సాంబయ్య, యంత్రం నడిపే యేసయ్య
||ఎంతోమంది||
పని వాళ్ళంతా సమానమే అని చెప్పేదే మన సమాజము
||ఎంతోమంది||