పిల్లి పిల్లి ఏమంటావ్
రచన: కీ.శే. కవికాకి జైసీతారాం
ప్రచురణ: "మేం పిల్లలం" టింబక్టు కలెక్టివ్
గానం: జ్యోతి, శిరీష, నాలుగో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
పిల్లీపిల్లీ ఏమంటావ్ - మ్యావ్ మ్యావ్ మ్యావ్
కాకికాకి ఏమంటావ్ - కావ్ కావ్ కావ్
కుక్కాకుక్కాఏమంటావ్ - భౌ భౌ భౌ
ఆవు ఆవు ఏమంటావ్ - అంబా అంబా అంబా
కోడిపుంజూ కోడిపుంజూ ఏమంటావ్ - కొక్కొరొక్కొకొక్కొరొక్కొ
కోకిలమ్మ కొకిలమ్మ ఏమంటావ్ - కుహు కుహు కుహు
మేక మేక ఏమంటావ్ - మే మే మే
గొర్రె గొర్రె ఏమంటావ్ - బే బే బే
బాతు బాతు ఏమంటావ్ - బెక్ బెక్ బెక్
కప్పా కప్పా ఏమంటావ్ - బెక బెక బెక బెక
పామూ పామూ ఏమంటావ్ - బుస్ బుస్ బుస్.
వ్యాఖ్యలు వారి సౌజన్యంతో