కొత్తపంటలు వచ్చాక పాత పంటలు పోయాయి. కొర్రలు, సామలు, ఆరికెలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇంకా మరెన్నో తృణధాన్యాలు మన రాష్ట్రం నిండా పల్లె పల్లెల్లో సునాయాసంగా పండేవి. ఒకసారి మనమందరం బియ్యానికి అలవాటు పడిన తరువాత వీటన్నిటికీ ఆదరణ కరువైంది. ఇప్పుడు, పట్నపు కష్ట జీవితాల్లో చక్కెరవ్యాధులు, గుండెపోట్లు అధికమైన తరువాత కొద్ది కొద్దిగా వీటికున్న వ్యాధి నిరోధక లక్షణాలు చర్చలోకి రావటం మొదలైంది మళ్ళీ. ఈ నేపధ్యంలో పాతపంటల్ని సంబరంగా గుర్తుచేసుకునే ఈ పాట, మీకోసం.
గానం: రోజా, ఎనిమిదో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
సంబరాలు సంబరాలు ఎన్నీయల్లో, మరి పాతా పంటా ఎన్నీయల్లో
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో !
పొద్దుగాలె పోతున్నాము ఎన్నీయలో, మరి సామ బువ్వ ఎన్నీయలో
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు||
పగటి భోజనం ఎన్నీయలో, మరి కొర్రాబువ్వా ఎన్నీయలో
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు||
రాత్రి భోజనం ఎన్నీయలో, మరి సజ్జ రొట్టే ఎన్నీయలో
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు||
పొద్దు గాలె పోతున్నాము ఎన్నీయలో, మరి రాగి ముద్దా ఎన్నీయలో
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు||