చెట్టు మీద నుండి కాకి కావ్ కావ్ కావ్
కొమ్మమీది కోయిలమ్మ కూ కూ కూ     "2"

చూరుమీద పిచ్చుకమ్మ చిక్ చిక్ చిక్
చిగురుచాటు రామచిలుక రామ్ రామ్ రామ్ "2"

బాటలోని కుక్కపిల్ల భౌ భౌ భౌ 
ఉట్టిమీద పిల్లిపిల్ల మ్యావ్ మ్యావ్ మ్యావ్    "2"

ఊయలలొ బుల్లిపాప క్యావ్ క్యావ్ క్యావ్
ఊయలూపు తల్లిపాట జో జో జో         "2"

గోడమీది గడియారం టిక్ టిక్ టిక్ 
రోడ్డు మీది కారు మోత పామ్ పామ్ పామ్   "2"

చదువుకున్న వారి బతుకు హాయ్ హాయ్ హాయ్ 
చదువురాని మొద్దు బ్రతుకు ఛీ ఛీ ఛీ
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song