కనుక్కో కనుక్కో ఓ బాలా
పొడుపుకథా చెబుతాను

కథ విప్పండీ-
కథ చెప్పండీ-

చూడచక్కని చిన్నది, గోడమీద ఉన్నది
నువ్వుచూస్తే నీలాగ, నేనుచూస్తే నాలాగ
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-         
                               
అద్దం!!

ఆవును గుంజకు కట్టేసి దూడ మేతకు వెళ్ళింది.
సాయంకాలం తిరిగొచ్చి ఆవుకు బంధం విప్పింది.
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-

తాళంచెవి!.

అమ్మకడుపులో నిద్రిస్తారు అరభైమంది పిల్లలు
మేలుకున్న పిల్లవాడు కాలిపోతాడు
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                           
అగ్గిపుల్ల!

పొద్దున్నే జననం, రాత్రంతా శయనం
సాయంకాలం పయనం 
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                          
సూర్యుడు!
        
నల్లని ముఖమూ, నలచదరం
పిల్లలు పెట్టే తెల్లని వాతలు 
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                           
పలక!
                         
ఒంటి చేతి పిల్లా, వడ్డించు మల్లా
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                          
గరిటె!
                              
కవలపిల్లలిద్దరు, కాళ్ళకింద ఉందురు
ఒకరిని విడచి ఉండరు, ఒంటరిగా నడవరు.
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                           
చెప్పులు!
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song