1. కొత్తతరం పూజారి ఏమని అడ్వర్టయిజుమెంటు ఇచ్చాడు?
    "ఈ గుడిలో పూజ చేయండి- ఉచిత డోర్ డెలివరీ కలదు" అని.

  2. లెక్కల మేస్టారు ఇష్టంగా ఎంచుకున్న ఇంటి నెంబరు ఏది?
    1/2 -3/4 +5/6 x 7/8 % 9

  3. ఎవరి చెంపమీద వాళ్ళు కొట్టుకునేది ఎప్పుడు?
    చెంపను దోమ కుడుతున్నప్పుడు!

  4. తాత ముత్తాతలు సంపాదించకుండానే మనకు అందేది ఏది?
    కాలం!

  5. మాటల మూటలు మోసేదెవరు?
    ఫోను!

  6. ఏ దేవుడికీ చెందని దీక్ష ఏది?
    నిరాహార దీక్ష!

  7. ప్రాణం‌లేకపోయినా కరిచేది ఎవరు?
    చెప్పు!