కాకి కాకి
కడవల కాకి
కాకి నోట్లో
కర్ర ఉంది
కర్ర తెచ్చి
అమ్మ కిస్తే
అమ్మ నాకు
అట్టు ఇస్తే
అట్టు నేను
ఆవు కిస్తే
ఆవు నాకు
పాలు ఇస్తే
పాలు నేను
అవ్వకిస్తే
అవ్వనాకు
జున్ను ఇస్తే
జున్ను నేను
మామకిస్తే
మామ నాకు -పిల్లనిస్తే
పిల్ల పేరు -మల్లెమొగ్గ
నా పేరు - జమీందార్!!