గురువులు మీరే
గురువులు మీరే జ్ఞాన తరువులు మీరే
విద్య దానం చేసి జ్ఞానవంతులు చేసే
పరమ పూజ్యులు మీరే
అపర బ్రహ్మలు మీరే "గురువులు"
బలపం పట్టి రాతను నేర్పే
బతుకులు మార్చే బాధ్యత మీదే
పగలూ రాత్రి వెలుగూ నిచ్చే
సూర్యులు మీరే- వెలుగుదివ్వెలు మీరే
ఫలమును ఇచ్చే తరువులకన్నా
దూరదృష్టినిచ్చే గురువులు మిన్న
ఫలితం కొరకు ప్రాకులాడని
వ్యక్తులు మీరే- దివ్యశక్తులు మీరే "గురువులు"
మంచిని పెంచే మార్గం చూపే
చెడునూ తుంచే కంచెను వేసే
రక్షణ మీరే- మా బాధ్యత మీదే
మంచి మార్గం చూపే వేగుచుక్కలు మీరే గురువులు"
రచన: శ్రీ.sssరావు. గానం: మంజునాథ్, నారయణమ్మ, 6వతరగతి, mpups-బద్దలాపురం.
జామతోట
జామతోటకు పోయాను
జామ చెట్టూ చూసాను
జామ కాయా కోసాను
జామకాయా తిన్నాను
కిందకు నేను జారాను
అప్పుడూ ముల్లూ విరిగింది
అమ్మా నన్ను కొట్టింది
నాన్నా ముల్లూ తీసాడు
అమ్మ నాకు తెచ్చింది బొమ్మ
అమ్మనాకు తెచ్చింది బొమ్మా
చక్కనైనా రబ్బరి బొమ్మా
కొత్త గౌను తెచ్చి కుట్టినాను
దాని కళ్ళకు కాట్టుక పెట్టినాను
బుగ్గ పై చుక్క పెట్టినాను "అమ్మనాకు"
పాల బువ్వ కలిపి పెట్టినాను
అది తిన్ననంటే ఒక దెబ్బవేసినాను
అది కూయి మంటే జోలపాట పాడినాను "అమ్మనాకు"
గానం: గంగోత్రి, 4వతరగతి.
చిన్ని చేప
చిన్న చిన్న చినుకురా
పెద్దవాన కురిసే రా
వాగు వంక పొంగె రా
చెరవులన్నీ నిండేరా
చెర చాప తేపెరా
చేపల్లన్ని పట్టెరా
గానం: రజిత, 4వ తరగతి, M.P.U.P.S, బద్దలాపురం.