గానం: రాజేశ్వరి, ఏడవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
చిత్రం: శివ ప్రసాద్, బి యఫ్ ఎ (మొదటి సంవత్సరం), జె యన్ టి యు, హైదరాబాదు.
భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం
కోట్లకొలదిగ భారతీయులు సమర్పించే వందనం
|భారతాంబిక పునర్వైభవ|
కవుల కలముల జాలువారే కవిత్వామృత ధారలన్నీ
గాయకుల గొంతులను పలికే మధురమౌ నిస్వనములన్నీ
భావుకుల గుండెల్లొ ఉరికి-పరుగులిడు భావమ్ములన్నీ
భావుకుల గుండెల్లొ ఉరికి-పరుగులిడు భావమ్ములన్నీ
|భారతాంబిక పునర్వైభవ|
హలం పట్టి పొలం దున్నే కర్షకుల కరములను సత్తువ
శక్తినంతా చెమట చేసే శ్రామికుల నరములను బిగువ
కత్తి పట్టి కదం త్రొక్కే వీర సైనిక ధీర హృదయం
కత్తి పట్టి కదం త్రొక్కే వీర సైనిక ధీర హృదయం
|భారతాంబిక పునర్వైభవ|
నవతకోరే యువత గుండెల ఉరకలెత్తే నవోత్సాహం
సకల శాస్త్ర విజ్ఞానవేత్తల పాండితీ ప్రాకర్షలన్నీ
సకలశాస్త్ర విజ్ఞానవేత్తల పాండితీ ప్రాకర్షలన్నీ
|భారతాంబిక పునర్వైభవ|
అన్ని కళలూ అన్ని విద్యలు వృత్తులూ ప్రవృత్తులన్నీ
ప్రాంత భాష కులమతమ్ముల భేదములు ఛేదించుకుంటూ
దేశ శ్రేయమె ధ్యేయమై , నిజ దేశరక్షణ ధీక్షగైకొని
దేశ శ్రేయమె ధ్యేయమై , నిజ దేశరక్షణ దీక్షగైకొని
|భారతాంబిక పునర్వైభవ|