ఆదిలాబాదు జిల్లారా
ఇది ఎర్రనీ అడవిమల్లెరా

పచ్చని‌అడవంతా ఆకాశమైతే
పల్లెలన్నీ జాబిలమ్మలు
ఈ గోండులే వేగు చుక్కలురా
|ఆదిలాబాదు జిల్లారా|

తిరుగుబాటుకూ తిలకాన్ని దిద్దిన
ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా |ఇంద్రవెల్లికి |
తూటాలు దించిన పాతర పేల్చిన
కడుపుకోత అనుభవించిందిరా |కడుపుకోత|

తిరుగుబాటుకూ తిలకాన్ని దిద్దిన
ఇంద్రవెల్లికి పురుడుపోసిందిరా
తూటాలుదించిన పాతర పేల్చిన
కడుపుకోత అనుభవించిందిరా
పోరుల్లో పారిన నెత్తుటి వరదల్ని
మట్టి దోసిళ్లతో పట్టిందిరా
|ఆదిలాబాదు జిల్లారా|

కొమరం భీముని సమరాన నడిపిన 
ఆదివాసులా కన్నమ్మరా |ఆదివాసులా |
కొండకోనల్లో గుండెల్ల తిరుగాడే
లంబాడికోయెల పుట్టిల్లురా |లంబాడికోయెల|
కొమరం భీముని సమరాన నడిపిన
ఆదివాసుల కన్నమ్మరా
కొండకోనల్లో గుండెల్ల తిరుగాడే
లంబాడి కోయల పుట్టిల్లురా
ఎండల్లో అలసిన ఎన్నెన్నో గుండెల్ని
చల్లబరచే నీళ్ల రంజనురా
|ఆదిలాబాదు జిల్లారా|

ప్రాణహిత నది గోదారి అలలకు 
ఒడిలోన నడకల్ని నేర్పిందిరా |ఒడిలోన|
పచ్చిక పైరుల పచ్చాని అడవుల్ని 
తలమీద కురుల్లోన ముడిచిందిరా |తలమీద| 
ప్రాణహిత నది గోదారి అలలకు 
ఒడిలోన నడకల్ని నేర్పిందిరా
పచ్చిక పైరుల పచ్చాని అడవుల్ని 
తలమీద కురుల్లోన ముడిచిందిరా
లేలేత చిగురుల నిలిచిన 
వృక్షాల వనదేవిగా పేరు మోసిందిరా
|ఆదిలాబాదు జిల్లారా|

రాతికొండలను పిండిగా పొడిచేసి 
కట్టడాలకు కండ అయ్యిందిరా |కట్టడాలకు|  
కలపాను కరనమిలి కాగితమ్మును చేసి
చదువులమ్మకు తోడు నిలిచిందిరా |చదువులమ్మకు తోడు|
రాతికొండలను పిండిగ పొడిచేసి 
కట్టడాలకు కండ అయ్యిందిరా 
కలపను కరనమిలి కాగితమ్మును చేసి
చదువులమ్మకు తోడు నిలిచిందిరా
గుండెల్లో తరగని గనులెన్నో 
పొదిగిన  సిరులా రాణి సింగరేణిదిరా   
|ఆదిలాబాదు జిల్లారా|

పచ్చని అడవంత ఆకాశమైతే
పల్లెలన్నీ జాబిలమ్మలు 
ఈ గోండులే వేగు చుక్కలురా 
|ఆదిలాబాదు జిల్లారా|
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song