స్వతంత్ర భారత జననీ- నీకిదె
నితాంత నవ నీరాజనము
అశేష పూజా శిరీషములతో
అగణిత నర నారీ జనము
వదలెను చిర దాస్య శృంఖలమ్ములు
చెదరెను దైన్య తమ: పటలమ్ములు
ఆసేతు హిమనగమ్మొక పొంగై
అలముకున్నదానంద తరంగము "స్వతంత్ర"
త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన
శాంత్యహింసలే సదాశయములుగ
సకల వసుంధరనేకము సేయగ
అకళంకులమై ప్రతినలు సేతుము "స్వతంత్ర"