౦. కొత్తపల్లి గురించి "ఈమాట" వెబ్ పత్రికలో వచ్చిన "మాటా మంతీ" కొత్తపల్లి నిర్వహణకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. చూడండి:
ఈమాట మాటామంతీ
1. కొత్తపల్లి పుస్తకాలను ఏనెలకానెల ఇంటికి ఎలా తెప్పించుకోవాలి?
కొత్తపల్లి కథల పుస్తకాలను ఇంటికి తెప్పించుకోండి..!
కొత్తపల్లి పత్రికను ఇంటర్నెట్లో చదవటం అందరికీ వీలవ్వక పోవచ్చు. ముఖ్యంగా పిల్లలు- ఎక్కువ సమయాన్ని వాళ్ళు కంప్యూటర్ల ముందు గడపటం ఏమంత మంచిది కాదెలాగూ.
అంతేకాదు; నిజం పుస్తకాలను చేతిలో పట్టుకొని చదివిన అనుభూతి వేరు; కంప్యూటరు తెరమీద చదవటం వేరు.
కొత్తపల్లి కథల్ని మరింతమంది పిల్లలకు నేరుగా అందించేందుకై ఏనెలకానెల కొత్తపల్లి పత్రికను పూర్తి రంగుల పుస్తకాలుగా పరిమిత సంఖ్యలో ముద్రించటం జరుగుతున్నది.
12 ప్రతులకోసం ముందస్తు చందా 300 రు.లు కడితే, పుస్తకాలను ఏనెలకానెల సాధారణ పోస్టులో మీరిచ్చిన చిరునామాకు పంపగలం.
ప్రస్తుతం ఇవి భారతదేశంలో మాత్రమే లభిస్తున్నాయి.
వివరాలకోసం సంప్రతించండి: (కొత్తపల్లి ఆఫీసు ఫోను ) 7702877670
2. ఇప్పటికే ప్రచురితమైన కొత్తపల్లి పుస్తకాల మాటేమిటి?
కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతులు "కొత్తపల్లి కథల పుస్తకాలు"గా రంగుల ఆఫ్‌సెట్లో 2011 జనవరి నుండి లభిస్తున్నాయి.
వివరాలు:
2012లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ.240/- (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)
2013 లో వెలువడిన 07 పుస్తకాల చిరుసంపుటి వెల- రూ. 175/- (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)
2014లో ఇప్పటివరకూ వెలువడిన 07 పుస్తకాల చిరు సంపుటి వెల- రూ. 175/- (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)
అంతకు ముందు 2008 నుండి 2011 వరకు ముద్రించబడిన ఆఫ్‌సెట్ ప్రతులు ప్రస్తుతం అందుబాటులో లేవు.
అయితే అవసరం ఉన్న మేరకు, వాటిలో ఏవి కావాలంటే వాటిని, ఎన్ని కావాలంటే అన్ని ప్రతులుగా తెలుపు-నలుపుల్లో, ఇంక్‌జెట్ ప్రింటర్లలో ముద్రించగలుగుతున్నాం!
మీ బంధు మిత్రులకు గుర్తుగా ఇచ్చేందుకు గాను వాటిపై మీరిచ్చే అదనపు సమాచారాన్ని కూడా కలిపి ముద్రించటానికి వీలవుతున్నది.
వివరాలకు సంప్రతించండి: 77028 77670
ఈ మొత్తాలను యం.వో/డిడి/బ్యాంకు ట్రాన్సుఫర్ ద్వారా "Kottapalli Prachuranalu" పేర పంపించవచ్చు.
పోస్టలు చిరునామా:
Kottapalli prachuranalu,
1-127/A, Near MRO Office,
Chennekothapalli,
Anantapatur (Dist.)
Andhra Pradesh
PIN: 515101
ఫోను (ఆఫీసు): 08559 240495, 77028 77670
ఈ-మెయిలు: team@kottapalli.in
బ్యాంకు అకౌంటు వివరాలు:
Kottapalli Prachuranalu,
Savings A/C No: 62320333310
SBH- Dharmavaram Branch,
ISFC Code: SBHY0020902
3. కొత్తపల్లికోసం మేమేమైనా విరాళాలు పంపవచ్చా?
ఓఁ.. తప్పకుండా పంపచ్చు.
పిల్లలలో తెలుగు పట్ల ఆదరణ పెంచేందుకుగాను కొత్తపల్లిని చాలావరకు స్వచ్ఛందంగా నడిపిస్తూ వస్తున్నాం. దీనికై మీ వంతుగా, మీకు తోచినంత మొత్తాలను, ఎప్పుడు వీలైతే అప్పుడు, విరాళంగా ఇస్తూ ఉండమని విన్నపం.
కొత్తపల్లి ప్రతుల ముద్రణ వ్యయం జనవరి 2013 నుండి ప్రతి నెలా 33000రూ. అవుతున్నది. సహృదయులైన మిత్రులు వ్యక్తిగతంగా- తమ శక్తి కొద్దీ అర్ధనెల- ఒకనెల- రెండు నెలలు- పలు నెలలు- ఇలా ముద్రణ వ్యయాన్ని భరించగలిగితే గొప్ప సాయం కాగలదు.
కొత్తపల్లిలో బొమ్మలు గీస్తున్న కళాకారులకు, అక్షరాలను కూరుస్తున్న విద్యార్థులు కొందరికి, పత్రిక ప్రతుల్ని దుకాణాలకు- పాఠకులకు అందించటంలో సాయపడుతున్న యువకులకు కొందరికి ప్రతినెలా చిన్నపాటి పారితోషికాలు ఇవ్వటం జరుగుతున్నది. ఈ మొత్తాలు, పుస్తకాల రవాణా, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ప్రతినెలా సరాసరిన 15,000రూ. అవుతున్నాయి. మిత్రులు ఈ మొత్తాలలో కొన్నింటిని తమ వంతుగా అందించగలరేమో చూడవచ్చు.
1,000 రూ -లేదా ఆ పైన- విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక సంవత్సరం పాటు పత్రిక ప్రతులను కృతజ్ఞతా పూర్వకంగా అందించగలం.
మీ విరాళాలను "కొత్తపల్లి ప్రచురణలు" పేరిట పై చిరునామాకు మనీఆర్డరు/బ్యాంకు ట్రాన్సుఫర్ల ద్వారా పంపగలరు.
కొత్తపల్లి పత్రికకు నేరుగా విదేశీ నిధులు స్వీకరించే సదుపాయం లేదు- కనుక మీ విరాళాలను కేవలం భారతీయ బ్యాంకుల ద్వారా/తపాలా శాఖ ద్వారా (రూపాయలలో మాత్రమే) అందించగలరని మనవి.
4. కొత్తపల్లి పత్రిక కోసం మేమూ కథలు రాసి పంపచ్చా?
ఓఁ.. తప్పకుండా పంపచ్చు.
పిల్లల్లో సృజనాత్మకత సహజం. కథలు, ఆటలు, పాటలు, బొమ్మలు దానికి ఊతాన్నిస్తాయి. మాతృభాషలో ఇష్టంగా చదవటం, తేలికగా రాయటం వస్తే, అటుపైన అన్ని శాస్త్రాలూ సులభంగా వంటపట్టుతాయి- నిజం! అందుకని మీ పిల్లల్లో ఉన్న కాల్పనిక శక్తికి పదును పెట్టండి. వాళ్లను కథలు రాసేందుకు, పాటలు పాడేందుకు, బొమ్మలు వేసేందుకు ప్రోత్సహించండి. వాళ్ళ రచనల్ని మాకు పంపండి. కావాలనిపిస్తే మీరే ఇలాంటి పత్రికనొకదాన్ని మొదలు పెట్టండి- ఎలాగైనా సరే- పిల్లలు పెద్దవాళ్లయ్యేలోగా వాళ్ళు చాలా చాలా తెలుగు కథల్ని చదివేలా, రాసేలా చేయండి. మీ పిల్లలకు ఈ పత్రికలోని కథలు నచ్చుతాయనే మా నమ్మకం- వీటిని వీలైనంత మందితో పంచుకోండి. మీరు రాసిన పిల్లల కథలు ఏమైనా ఉంటే పనిగట్టుకునైనా సరే, మాకు పంపండి. వీలు చేసుకొని ప్రచురిస్తాం.
5. ఈ పుస్తకాలనీ ఈ కథల్నీ పంచుకోవచ్చా?
ఓఁ.. తప్పకుండా పంచుకోవచ్చు.
మీకు ఈ పుస్తకం నచ్చిందా? మరైతే దీన్ని వృధా పోనివ్వకండి. మీదగ్గరున్న పుస్తకాలను మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. 'పుస్తకాలు పంచుకోవటం' బలే బాగుంటుంది! దానివల్ల అందరికీ లాభమే మరి!
6 కొత్తపల్లి కథలకి కాపీరైటు ఏమీ లేదా, ఎందుకు?
కొత్తపల్లి కథల పుస్తకాల్లోని కథలన్నిటికీ “క్రియేటివ్ కామన్స్ వారి షేర్ అలైక్-నాన్ కమర్షియల్ లైసెన్సు”వర్తిస్తుంది. అంటే దానర్థం, వ్యాపారం కాకుండా మరేదైనా పనికోసమైనంతవరకూ ఎవరైనా సరే- వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు, పంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు, చదువుకోవచ్చు, చదివించవచ్చు, మార్చేసుకోవచ్చు, అనువదించుకోవచ్చు, కావాలంటే ముద్రించుకోవచ్చు! కేవలం ఆయా రచయితలకో, కొత్తపల్లికో 'సౌజన్యం' వ్యక్తం చేస్తే చాలు. మన ప్రాచీన కావ్యాలు, రచనలు అన్నీ ఈ స్ఫూర్తితో చేసినవే కదా. అందుకని మీరు చేసే ఇతర రచనలన్నిటికీ కూడా ఇలాంటి లైసెన్సునే ఇవ్వండి!
పూర్తి వివరాలకోసం సందర్శించండి:
క్రియేటివ్ కామన్స్ వారి షేర్ ఎలైక్ లైసెన్సు పూర్తి పాఠం