ఈ చిత్రాన్ని చూడండి: చెక్క మీద చెక్కిన బొమ్మ ఇది. ఆస్ట్రియా దేశపు కళాకారుడు 'మోరిజ్ -వాన్-షిండ్' 1850వ సంవత్సరంలో దీన్ని చెక్కాడు. ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక గన్న కళాఖండాల్లో ఇది ఒకటి! వేటగాడి శవయాత్రని ఇందులో జంతువులు ఎట్లా జరుపుకుంటున్నాయో చూడండి: నిజానికి వాటికి ఇది ఓ పండగ. అయితే శవ యాత్రలో అవన్నీ దు:ఖాన్ని నటించాలి! అందుకని అవి కొంచెం నవ్వుగా, కొంచెం ఏడుపుగాముఖాలు పెట్టుకొని ఉన్నాయి! ఇలాంటి సందర్భం బాగుంది కదూ? ఇది వచ్చేట్లుగా ఓ కథ రాసి చూడండి. మీరు రాసిన కథని వెంటనే మాకు పంపించండి. బాగుంటే ప్రచురిద్దాం! ఆలస్యం ఎందుకు? ప్రయత్నించండి!